ఇంజినీరింగ్ రెండో సంవత్సరం ప్రవేశాల కొసం గత నెలలో నిర్వహించిన ఏపీ ఈసెట్ పరీక్షలో ప్రకాశం విద్యార్దులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. వేటపాలెం మండలానికి చెందిన ఇద్దరు చేనేత వర్గానికి చెందిన పిల్లలు శెభాష్ అనిపించారు.
సిరామిక్ విభాగంలో రాష్ట్రస్థాయిలో కొత్తపేట పంచాయితీ రోశయ్య కాలనీకి చెందిన తూతిక సంతోష్ ప్రథమ ర్యాంకు సాధించాడు. ఇతని తల్లిదండ్రులు దుర్గారావు, దుర్గమ్మలు. పందిళ్లపల్లికి చెందిన పృథ్వీ శనికుమార్ ఇదే సిరామిక్ విభాగంలో తొమ్మిదో ర్యాంకు సాధించారు...ఈసెట్ పరీక్షలకు మొత్తం 1,336 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్ పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధించటమే తమ ఆశయమని ర్యాంకర్లు తెలిపారు.
ఇదీ చదవండి: