కరోనా కారణంగా పనులు లేక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న పేదలకు.. ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీసులు అండగా నిలిచారు. బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కడవకుదురు రహదారిలో గుడారాలు వేసుకుని జీవిస్తున్న పేదలను గమనించిన ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్ వివరాలు సేకరించారు. ఎస్ ప్రసాద్, ఇతర సిబ్బందితో కలిసి 20 కుటుంబాలకు బియ్యం అందజేశారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: