Prakasam District Dalit Woman Case Updates: ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో దళిత వితంతు మహిళపై వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఒంగోలులో జిల్లా ఎస్పీ మలికా గార్గ్ మీడియా సమావేశం పెట్టి వెల్లడించారు. దళిత మహిళపై దాడి ప్రణాళిక ప్రకారమే చేశారని, ఆమెను చిత్ర హింసలకు గురిచేశారని, పెట్రోల్ పోసి చంపడానికి సిద్దం అవుతున్న సమయంలో పోలీసులు వెళ్లి ఆ మహిళను కాపాడారని ఆమె పేర్కొన్నారు.
Murder Attempt on Dalit Woman: దళిత మహిళపై దారుణ కీచకకాండ.. వివస్త్రను చేసి.. వీధుల్లో ఈడ్చుకెళ్లి..
Prakasam SP Malika Garg on Dalit Woman Case: ఎస్పీ మలికా గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి, పుల్లమ్మల కుమార్తె భార్గవి, అదే గ్రామంలో దళిత వర్గానికి చెందిన సాయిరాం ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం వీరిద్దరూ వేరే ప్రాంతంలో ఉండటం వల్ల వారి ఆచూకీ కోసం బ్రహ్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. కాగా, అదే గ్రామంలో నివాసం ఉంటున్న సాయిరాం సోదరి మౌనికకు.. వీరి ప్రేమ వ్యవహరాలు అన్నీ తెలుసని, భార్గవి సమాచారం కూడా తెలిసి ఉంటుందని భావించి ఆమెపై పగబట్టారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత మంచి నీళ్లు పట్టుకోడానికి మౌనిక కొళాయి వద్దకు రావడంతో బ్రహ్మారెడ్డి , అతడి భార్య పుల్లమ్మ ఆమెను అపహరించి, వాళ్ల ఇంటికి తీసుకువెళ్లారని ఎస్పీ వివరించారు.
Two Accused Arrested in Prakasam Dalit Woman Case: మౌనికపై ఇనుప రాడ్లతో బలంగా కొట్టారని, కాళ్లూ ,చేతులు కట్టి, మర్మావయవాలమీద దాడి చేశారని తెలిపారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో మౌనిక తల్లి అనురాధా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో దర్శి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మౌనికను కాపాడినట్లు తెలిపారు. మౌనికకు పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. మౌనికపై దాడికి పాల్పడిన బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
"బొట్లపాలెంలో దళిత మహిళ మౌనికపై ప్రణాళిక ప్రకారమే దాడి చేశారు. రాత్రి మౌనికను బ్రహ్మారెడ్డి అపహరించి చిత్రహింసలు పెట్టారు. మౌనిక సోదరుడు, అతని భార్య అడ్రెస్ చెప్పాలని దాడి చేశారు. పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు కూడా ప్రయత్నించారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు క్షణాల్లో వెళ్లి ఆమెను కాపాడారు. బ్రహ్మారెడ్డి కుమార్తెను మౌనిక సోదరుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్గవి, సాయిరామ్ సమాచారం కోసం మౌనికపై దాడి చేశారు. బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మపై కేసు నమోదు చేసి అరెస్టు చేశాం."-మలికా గార్గ్, ప్రకాశం జిల్లా ఎస్పీ