పంచాయతీ ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ ఒక వైపు జరుగుతున్నా... ఎన్నికల నియమావళిని ప్రకాశం జిల్లా యంత్రాంగం పట్టించుకోవటం లేదు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాల నియంత్రణపై దృష్టి సారించటం లేదు. పార్టీల ఫ్లెక్సీల తొలగింపు, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసే విషయంలో ఎవరూ శ్రద్ధ చూపడం లేదు.
సంతనూతలపాడు మండల కేంద్రంలో ప్రముఖ రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయలేదు. స్థానిక సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫోటో దర్శనమిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ జరిగే కార్యాలయాల్లోనూ ముఖ్యమంత్రి ఫోటోలు తొలగించకపోవటం విమర్శలకు తావిస్తోంది.
ఇదీ చదవండి