ప్రకాశం జిల్లాలో కరోనా పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో హైరిస్క్ కేసులను ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ కళాశాల క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఒంగోలులో 3,200 మంది రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 10 వేల మందికి చికిత్స అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
రైజ్‌లో క్వారంటైన్ కేంద్రం పరిశీలన
ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలను క్వారంటైన్ కేంద్రంగా మారుస్తుండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఉన్న ఫర్నీచర్, వైద్యులు, నర్సులు, పోలీసు సిబ్బంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 200 మందిని ఉంచవచ్చని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం వీడియో కాన్ఫరెన్స్
కరోనా నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై అమరావతి నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రైవేట్ వైద్యశాలల యాజమాన్యం, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ భాస్కర్, డీఆర్వో వెంకటసుబ్బయ్య, రాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు నీరద, డీఎంహెచ్‌వో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి