ETV Bharat / state

మామకు కరోనా పాజిటివ్: చూసొచ్చిన అల్లుడిపై కేసు - మామకు పాజిటివ్ అల్లుడిపై కేసు

కరోనా పాజిటివ్​గా తేలిన తన మామను ఆసుపత్రిలో కలిసి...నాలుగేళ్ల కుమారుడితో సహా రహస్యంగా ఇంటికి చేరిన అల్లుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Positive to uncle  case against son-in-law
మామకు పాజిటివ్ ...చూసొచ్చిన అల్లుడిపై కేసు
author img

By

Published : Apr 14, 2020, 4:09 AM IST

కరోనా పాజిటివ్​గా తేలిన తన మామను ఆసుపత్రిలో కలిసి...నాలుగేళ్ల కుమారుడితో సహా రహస్యంగా ఇంటికి చేరిన అల్లుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన ఒ వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడిని ఇటీవల తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన తన మామ గారింటికి పంపారు. మామకు గుండె నొప్పి రావటంతో బంధువులు ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. వైద్యులు అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. ఆసుపత్రి వద్ద ఉన్న తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చిన అల్లుడు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులందరినీ ఒంగోలులోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఆ ఇంటిచుట్టు పక్కల వారికి నోటిసులు జారీ చేసి ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

కరోనాపై పెయింటింగ్​తో ప్రజలకు అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.