ప్రకాశం జిల్లాలో గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. 12 అసెంబ్లీ, ఒంగోలు, బాపట్ల లోక్‌సభకు సంబంధించి దాదాపు 26,32,407 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. 3,269 పోలింగ్ కేంద్రాల్లో 8,288 ఈవీఎంలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు దాదాపు 1600 ఈవీఎంలు సిద్ధం చేశారు. సుమారు 26వేల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
35,945 మంది దివ్యాంగ ఓటర్లుండగా వీరికి సహాయకులు, వాహనాలు, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు భద్రత పరంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 63 స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, 12 కంపెనీల రిజర్వు పోలీసులు, 1200 మంది సివిల్ పోలీసులు ఎన్నికల విధుల్లో పని చేయనున్నారు.