ETV Bharat / state

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: సీఎం కాన్వాయ్ కోసం ప్రైవేట్​ కారు.. ఇద్దరిపై సస్పెన్షన్​ వేటు

author img

By

Published : Apr 21, 2022, 8:18 AM IST

Updated : Apr 21, 2022, 6:12 PM IST

CM Convoy: ఒంగోలు కారు ఘటనపై ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితమైంది. దీనిపై సీఎంవో స్పందించింది. ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి జగన్​... అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. ఆర్టీఏ సిబ్బంది ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. వారిపై సస్పెన్షన్​ వేటు వేశారు.

police seized passenger vehicle for cm convoy
సీఎం కాన్వాయ్ కోసం కారు ఇవ్వాల్సిందే.. ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్

CM Convoy: సీఎం కాన్వాయ్‌ కోసమంటూ.. ఒంగోలులో ఆర్టీఏ అధికారులు దౌర్జన్యకాండకు తెరతీశారు. అద్దెకు తెచ్చుకున్న వారికి చెప్పకుండా.. ఇన్నోవా కారును బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఏం జరుగుతుందో తెలియక.. వినుకొండ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబం మార్గ మధ్యలో నడిరోడ్డుపై అవస్థలు పడాల్సి వచ్చింది. దీనిపై ఈటీవీ భారత్​ కథనం ప్రచురించింది. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సీఎంవో స్పందించింది. సీఎం జగన్​ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆర్టీఏ సిబ్బంది ఇద్దరిపై సస్పెన్షన్​ వేటు వేశారు.

వారికి ప్రభుత్వం తరపున క్షమాపణలు -మాజీ మంత్రి బాలినేని

జరిగింది ఇదీ..
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఫ్లెక్సీ వ్యాపారి వేముల శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో తిరుపతి బయలుదేరారు. ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని తిరుపతి పయనమయ్యారు. మార్గ మధ్యలో అల్పాహారం కోసం ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఆగారు. అంతలో.. అక్కడికి వచ్చిన ఓ రవాణాశాఖాధికారి దౌర్జన్యకాండకు తెరతీశారు. శుక్రవారం సీఎం జగన్ పర్యటన ఉందని పోలీస్‌ కాన్వాయ్ కోసం ఇన్నోవా కారు కావాలని చెప్పారు. కారులో ఉన్న లగేజీ మొత్తం తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీనివాస్ కుంటుంబం.. అవాక్కైంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నడిరోడ్డుపై కారు వదిలేసి దిగిపోమంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నా ఆర్టీఏ అధికారులు ఒప్పుకోలేదు. బలవంతంగా కారును తీసుకెళ్లిపోయారు. ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీను కుటుంబ సభ్యులు..ఒంగోలులో నడిరోడ్డుపైనే ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వాహనంలో తిరుమల చేరుకున్న వేముల శ్రీనివాస్‌ కుటుంబం...ఆర్టీఏ అధికారుల తీరుపై మండిపడ్డారు.

మెట్లపూజ మొక్కు చెల్లించకుండానే తిరుమలకు చేరుకున్నాం -వేముల శ్రీనివాస్

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో..కొత్త ప్రదేశంలో నడిరోడ్డుపై కాసేపు భయంతో గడిపాం. పిల్లలున్నారని వేడుకున్న ఒప్పుకోలేదు. ప్రజలను ఇబ్బందిపెట్టే ఇలాంటి ఘటనలపై సీఎం దృష్టి సారించాలి. అలిపిరి నుంచి మెట్లపూజతో కాలినడకన తిరుమల వెళ్లాలనుకున్నాం.. ఆర్టీఏ అధికారుల తీరుతో మూడోసారి మెట్లపూజ మొక్కు చెల్లించకుండానే తిరుమల చేరుకున్నాం -వేముల శ్రీనివాస్‌

రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనం: చంద్రబాబు
సీఎం కాన్వాయ్‌ కోసమంటూ ఇతరుల కారును బలవంతంగా తీసుకెళ్లిన తీరుపై... తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు ఒంగోలులో ప్రజల కారు లాక్కెళ్ళడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకెళ్ళడం దారుణమని ధ్వజమెత్తారు. భార్య, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్లిందని నిలదీశారు. ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వస్తే దుకాణాలు మూసెయ్యడం...సీఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటన్నారు.

కారు స్వాధీనంపై సీఎం కార్యాలయం ఆరా.. వాహనం తీసుకెళ్లాలని సూచన
ఒంగోలులో కారు స్వాధీనం ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో.. సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై సీఎంవో అధికారులు వివరాలు తెలుసుకున్నారు. ఇదే సమయంలో...ఇన్నావా వాహనాన్ని తీసుకెళ్లాలని డ్రైవర్‌కు... పోలీసులు సమాచారం ఇచ్చారు.

సీఎం ఆగ్రహం.. ఇద్దరిపై వేటు
Suspended: ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణికుల నుంచి కారు స్వాధీనం చేసుకున్న ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి కారణమైన హోంగార్డు పి.తిరుపతి రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​ ఎ. సంధ్యను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

Apologize from Government: తిరుపతి వెళ్లే భక్తుల వాహనాన్ని సీఎం కేన్వాయి కోసం ఒంగోలులో రవాణా శాఖాధికారులు తీసుకోవడం బాధాకరమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు పివిఆర్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్ల పరిశీలనకుమంత్రి ఆదిములపు సురేష్ తో కలిసి వచ్చిన ఆయన స్పందించారు.ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. బాధ్యులైన రవాణా శాఖాధికారులపై చర్యలు తీసుకున్నామని వివరించారు. భక్తులకు జరిగిన అసౌకర్యానికి ప్రభుత్వం తరపున బాలినేని క్షమాపణలు తెలిపారు. వారంతా తిరుమలలో దర్శనం చేసుకున్నారని వివరించారు.

ఇదీ చదవండి: తెదేపా నేత బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు..

Last Updated : Apr 21, 2022, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.