ప్రకాశం జిల్లా చీరాలలో వైకాపా నేతలు ఆమంచి, కరణం వర్గాల మధ్య పోరు మెుదలవటం.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు రావటం, చీరాలలో రాజకీయ పరిస్థితి హీటెక్కింది. ఇరు వర్గాల వారు నువ్వా... నేనా అన్నట్లు సీఎం పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేయటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీరాల డీఎస్సీ పి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వచ్చే రహదారుల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. పట్టణంలోకి అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ పుట్టినరోజు.. చంద్రబాబు శుభాకాంక్షలు