Suicide: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల వద్ద మంగళవారం.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న తల్లీబిడ్డల వివరాలను పొలీసులు వెల్లడించారు. తల్లి పేరంపల్లి కల్యాణి (24), పిల్లలు నందినీ రెడ్డి (5), వెంకట్ అవినాష్ రెడ్డి(4)గా గుర్తించారు.
మృతురాలి స్వగ్రామం చినగంజాం మండలం కుక్కలవారిపాలెం. ఈమెకు దర్శి మండలం చౌటుపాలేనికి చెందిన నారాయణ రెడ్డితో వివాహమైంది. చిన్న పనులు చేసుకుంటూ.. విజయవాడ సమీపంలో తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు.
అయితే.. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తాడేపల్లి నుండి చినగంజాంకు వచ్చిన కల్యాణి.. తన ఇద్దరు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబసభ్యుల ఆచూకీ తెలుసుకునేందుకు.. పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ప్రసారమాధ్యమాల్లో ఫొటోలు ప్రసారం చేశారు. దీంతో.. మృతుల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తల్లీబిడ్డలు ఆత్మహత్య చేసుకోవడంతో.. స్వగ్రామం కుక్కలవారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగింది..?
woman Suicide at Prakasam: ఇద్దరు పిల్లలతో సహా మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా చినగంజాంలో మంగళవారం జరిగింది. సోపిరాల రైల్వేగేటు సమీపంలో అందరూ చూస్తుండగానే.. ఒంగోలు నుండి చీరాల వైపు వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి:
Vasireddy Padma: 'మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది'