ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని.. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా ఏడుగుండ్లపాడు, ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. నియోజకవర్గంలో సర్పంచి అభ్యర్థులుగా పోటీ చేసేందుకు మొత్తం 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీకి ఈనెల 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... చీరాల డీఎస్పీ పీ.శ్రీకాంత్ పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. రామన్నపేట పంచాయతీలో ఉన్న 14 వార్డులకు..14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ వీటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. రెండోరోజు అభ్యర్థుల నుంచి నామపత్రాలను అధికారులు స్వీకరించారు.
ఇదీ చదవండి: