ప్రకాశం జిల్లా గిద్దలూరులో వలస కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నాగులదిన్నకు చెందిన 42 మంది వలస కూలీలు మిర్చి పంట కోత పనుల కోసం ఒంగోలు దగ్గర ఉన్న రెడ్డిపాలేనికి వచ్చారు. అయితే లాక్డౌన్ కారణంగా పనులు నిలిచిపోయి వారు ఇక్కడే చిక్కుకుపోయారు. ఇన్నాళ్లు తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులతో నెట్టుకొచ్చిన వాళ్లు ఇప్పుడు పూట గడవటం కష్టమై సొంతూరికి బయలుదేరారు. గిద్దలూరులో పోలీసులు వారిని ఆపగా.. 2 రోజుల నుంచి తినడానికి తిండి లేక చిన్న పిల్లలతో ఊరికి వెళ్తున్నామని చెప్పారు. వీరి దుస్థితికి చలించిన పోలీసులు వారికి ఆహారం అందించి క్వారంటైన్‌కు తరలించారు.
ఇవీ చదవండి..