SAVE: ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఓ వ్యక్తిని ప్రకాశం జిల్లా కంభం పోలీసులు కాపాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం పూలసుబ్బయ్య కాలనీకి చెందిన పూసలపాడు సుబ్బారావు అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురయ్యాడు. దీంతో.. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కంభం పట్టణ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన సుబ్బారావు.. 100కు ఫోన్ చేసి తాను ప్రాణాలు తీసుకుంటున్నట్టు చెప్పాడు.
దీంతో అప్రమత్తమైన అధికారులు.. కంభం ఎస్సై నాగమల్లేశ్వరరావుకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన కంభం ఎస్సై.. సుబ్బారావు వాడుతున్న మొబైల్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి ఎట్టకేలకు అతనిని పట్టుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సుబ్బారావు భార్యను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఆత్మహత్య చేసుకోబోతున్న సుబ్బారావును పోలీసులు రక్షించడంపై.. అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: