నివర్ తుపాన్ ప్రభావంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో మూడో నెంబరు ప్రమాద సూచిక ఎగుర వేశారు. మత్స్యకారులు పడవలు, వలలు ఒడ్డుకు చేర్చుకునేలా చర్యలు చేపట్టారు. మూడు మండలాల్లోని సముద్ర తీరప్రాంతంలో చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ సిబ్బందితో కలిసి పర్యటించారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక అధికారులు నియమించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని డీఎస్పీ శ్రీకాంత్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...