ETV Bharat / state

ఆలోచన ఉండాలే కానీ... ఆదాయానికి మార్గాలెన్నో..! - success story

ఎందుకు పనికి రావనుకుని మూలన పడేసే వస్తువులతో ఆదాయాన్ని అర్జిస్తున్నాడు ఓ చిరు పారిశ్రామిక వేత్త.  పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి అందమైన ఫొటో ఫ్రేమ్​లు తయారు చేస్తున్నారు. ఆలోచన ఉండాలే కానీ ఆదాయానికి మార్గాలేన్నో అని నిరూపిస్తున్నారు.

ప్లాస్టిక్​కి కొత్త రూపం
author img

By

Published : Apr 23, 2019, 7:02 PM IST

వ్యర్థం నుంచి ధనం

పాతపడిన టీవీలు, కంప్యూటర్లు, ఫ్రిడ్జ్​లు, కుర్చీలు వంటి ప్లాస్టిక్‌ వస్తువులు బయట పారేస్తుంటాం. అవి భూమిలో కలవకపోవడం వల్ల పర్యావరణానికి సవాల్​గా మారుతున్నాయి. అవే తన వ్యాపారానికి పెట్టుబడిగా మలచుకున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సురేశ్. స్థానికంగా లభించే ప్లాస్టిక్‌ వ్యర్థాలను చిరువ్యాపారుల వద్ద నుంచి సేకరించి వాటిని కరిగించి ప్లాస్టిక్‌ గుళికలు తయారు చేస్తున్నారు. వీటితో అందమైన ఫోటో ఫ్రేమ్‌లు తయారు చేసి ఆదాయాన్ని అర్జిస్తున్నారు.

విదేశాల్లోనూ గిరాకీ..
గతంలో ఫొటో ఫ్రేమ్‌లు కలపతో తయారు చేసేవారు.. ఇలా చేయడం వల్ల కొంతకాలానికి చెట్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని భావించారు. ప్లాస్టిక్ ఫొటో ఫ్రేమ్‌లు తయారు చేసి చెన్నై వంటి పట్టణాలతోపాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. వివిధ రకాల డిజైన్లు, పరిమాణాల్లో తయారు చేస్తున్నందున ఈ ఫ్రేమ్‌లకు మంచి గిరాకీ ఉంటోంది. దీనివలన తన వ్యాపారం అభివృద్ధిపథంలో నడుస్తుందంటున్నారు సురేశ్. ఈ వినూత్న విధానం వలన తనతో పాటు మరికొంత మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. మద్దిపాడు సెంటర్​లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్రేమ్​లు తయారు చేసే రెండు యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇందులో 30 మంది వరకూ ఉపాధి పొందుతున్నారు. రెండు రకాలుగా పర్యావరణానికి మేలు కలిగిస్తూ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. వ్యర్థాలతో లాభాలు పొందుతూ తోటి పారిశ్రామిక వేత్తలకు సురేష్​ను ఆదర్శంగా నిలుస్తున్నారు.

Intro:నీటి సమస్యను పరిష్కరించాలని నిరసన

Body:ఉదయగిరి పట్టణంలో లో తలెత్తిన నీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సాధన సమితి ఆధ్వర్యంలో ఉదయగిరి మండల పరిషత్ కార్యాలయం వద్ద పట్టణంలోని పురవీధుల కు చెందిన ప్రజలు మంగళవారం నిరసన తెలిపారు. పట్టణంలో నీటి సమస్య పరిష్కారానికి పెద్ద చెరువులో బోర్లు వేయడంతో పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుతం పెద్ద చెరువులో వేసి ఉన్న బోర్లకు కు 24 గంటల విద్యుత్ సరఫరా ను ఏర్పాటు చేయాలన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న వీధుల్లో ఆధారంగా బ్యాంకులను ఏర్పాటు చేసి ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయాలన్నారు. అనంతరం ఎంపీడీవో హనుమంతరావు ను కలిసి పట్టణంలో వీటి సమస్యను వివరించారు. పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు స్థాయిలో ప్రజలకు చేరడం లేదన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు ట్యాంకర్లను పెంచి నీటి సమస్య లేకుండా చేయాలని వినతిపత్రం అందజేశారు.

Conclusion:నీటి సమస్యలు పరిష్కరించాలని నిరసన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.