ప్రకాశం జిల్లా కనిగిరిలో ఫొటో గ్రాఫర్లు ఒక రోజు బంద్ నిర్వహించారు. కరోనా కాలంలో శుభ కార్యాలు, వివాహాలు జరగకపోవటంతో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని ర్యాలీ నిర్వహించారు. కనిగిరిలోని వైఎస్ఆర్ రోడ్డు నుంచి నాజ్ సెంటర్ మీదుగా వెళ్లి పామూరు బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం ఫొటో గ్రాఫర్లు పాల్గొన్నారు.
ఇది చదవండి పంచాయతీ కార్యాలయానికి వైకాపా రంగు తొలగింపు