ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగిలో ప్రజలు నిరసన చేపట్టారు. కరోనాతో మృతి చెందిన వారిని ఊర్లోకి తెచ్చి ఖననం చేయవద్దని గ్రామస్థులు ఆందోళన చేశారు. కరోనాతో మరణించిన మృతదేహాలను కలెక్టర్ ఆదేశాలు మేరకు ఖననం చేసేందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. దానిని గుర్తించిన గ్రామస్థులు వారిని అడ్డుకోగా.. జిల్లా యంత్రాంగం నచ్చజెప్పినా ఒప్పుకోలేదు. తమ ప్రాంతంలో ఖననం చేయొద్దని చెప్పడంతో..అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, డీఎస్పీ ప్రసాద్, 50 మందికిపైగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్డీవో గ్రామస్థులను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ గ్రామంలోని ప్రజలు కరోనా మృతదేహాలకు అంత్యక్రియలకు నిరాకరించారు. దీంతో అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు.
ఇదీ చూడండి. కూతుళ్లకు పెళ్లి చేసే స్తోమత లేక తండ్రి ఆత్మహత్య