ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పరాశాల భారతి ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో భాజపా నేతలు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా రాష్ట్ర కార్యదర్శి కమలాకుమారి పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్త కృషి చేయాలి..
గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కమలాకుమారి సూచించారు. ప్రధాని మోదీ చేపడుతున్న అబివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. 2024 ఆంధ్రప్రదేశ్లో భాజపా విజయం సాధించేలా ముందుకు వెళ్లాలని కమలాకుమారి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.