ఒంగోలులో ఘనంగా సంక్రాంతి సంబరాలు - ఒంగోలులో ప్రభుత్వ సంక్రాంతి సంబరాలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు నిత్యం సుఖ సంతోషాలతో ఉంటున్నారని మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు డీవీఆర్ఎమ్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి బాలనేని పాల్గొన్నారు. భోగి మంటలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ పోలా భాస్కర్ వెలిగించారు. గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు, సాంస్కృతిక నృత్యాలు అలరించాయి.