ఒంగోలు నగరపాలక సంస్థ వైకాపా మేయర్ అభ్యర్థిగా 18వ డివిజన్ నుంచి గెలిచిన గంగాడ సుజాతను అధిష్ఠానం ఖరారుచేసింది. డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ (25వ డివిజన్) ఎంపికయ్యారు. రెండో డిప్యూటీ మేయర్‌గా వెలనాటి మాధవరావును నియమిస్తారని సమాచారం. మరోదఫా జరిగే సమావేశంలో డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఇక గురువారం జరిగే సమావేశానికి అభ్యర్థులు, అధికారులు, మీడియాను మాత్రమే అనుమతిస్తారు. అధికారపార్టీ సభ్యులకు వైకాపా విప్ జారీ చేసింది. విప్‌గా 21వ డివిజన్ విజేత యనమల నాగరాజును నియమించారు. ఆయన నగర పార్టీ అధ్యక్షులు సింగరాజు వెంకట్రావుతో కలిసి కలెక్టర్‌కు విప్ నియామక ప్రతిని అందజేశారు.
ఇదీ చదవండి: నగర, పురపాలికల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు