ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండడంతో కొవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులు ఒక్కరోజు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. కనిగిరి మండలం మొత్తాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని అష్టదిగ్బంధనం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరాలు మినహా.. అనవసరంగా రోడ్లపై తిరిగే వారికి జరిమానాలు విధిస్తూ.. వాహన రాకపోకలకు అడ్డుకుంటున్నారు.
ముఖ్యంగా కనిగిరి నగర పంచాయతిలోని అనేకచోట్ల రోడ్లకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణకు సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేశారు. నగర పంచాయతీలోని యాచకులు, నిరాశ్రయులు ఆకలితో బాధపడకుండా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తున్నారు. సంపూర్ణ లాక్డౌన్ ఉండడంతో కనిగిరిలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
ఇవీ చదవండి: