ETV Bharat / state

పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

పరిషత్‌ ఎన్నికలు యథాప్రకారం జరుపుకోవచ్చన్న హైకోర్టు తీర్పుతో... ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు... అధికారులు సర్వం సిద్ధంచేస్తున్నారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సులను ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది.

పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు

author img

By

Published : Apr 7, 2021, 9:17 PM IST

ఈ నెల 8వ తేదీన పరిషత్​ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు స్పష్టత ఇవ్వడంతో.. వేగంగా ఏర్పాట్లు ప్రారంభించినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పోల భాస్కర్ వెల్లడించారు. మద్దిపాడు, కొత్తపట్నం ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన.. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. జిల్లాలో 56 మండలాలు ఉండగా.. పొదిలి జడ్పీటీసీ స్థానం కోర్టు వివాదం కారణంగా నిలిచిపోయింది. మిగిలిన 55 చోట్ల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. ఇందులో 14 ఏకగ్రీవాలు అయ్యాయి. మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహించనున్నారు.

99 శాతం ఎన్నికల సిబ్బంది హాజరు అయ్యారని అందుకు వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆయా మండలాలకు ఎన్నికల సామగ్రిని తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి మండలానికీ ఓ రిటర్నింగ్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులను పంపామని ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత రావడంతో.. పోటీలో ఉన్న అభ్యర్థులకు సమాచారం ఇచ్చామన్నారు. అభ్యర్థులంతా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

ప్రజలంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఎన్నికలు సమర్థమంతంగా నిర్వహించడానికి.. ముందస్తు ప్రణాళికతో అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి స్పష్టత లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, హై కోర్టు ఆదేశాల మేరకు లెక్కింపు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

పరిషత్ ఎన్నికలు: మార్కాపురంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.