ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో ఊపుందుకున్న ఎన్నికల నామినేషన్లు... - ఒంగోలులో ఊపుందుకున్న స్థానిక సమరం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు ప్రకాశం జిల్లావ్యాప్తంగా జోరందుకున్నాయి. జిల్లాలో తొలిరోజు ఆరు జడ్పీ, 43 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.

nominations in praksham district
ప్రకాశం జిల్లాలో ఊపుందుకున్న ఎన్నికల నామినేషన్లు
author img

By

Published : Mar 10, 2020, 2:15 PM IST

ప్రకాశం జిల్లాలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 56 మండలాల్లో 55 జడ్పీటీసీ, 54 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలిరోజు ఆరు జడ్పీ స్థానాలకు నామినేషన్లు వేశారు. భాజపా, తెదేపా నుంచి ఒక్కొక్కటి, వైకాపా నుంచి మూడు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్లు వేశారు. జిల్లా మొత్తం మీద తొలిరోజు 43 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. తక్కువ వ్యవధి ఉండటంతో... అభ్యర్థుల వెతుకులాటలో పార్టీల్లో కొంత గందరగోళం నెలకొంది. మొత్తం మీద ఇప్పుడిప్పుడే స్థానిక ఎన్నికల వేడి ప్రారంభం అయ్యిందని చెప్పాలి.

ప్రకాశం జిల్లాలో ఊపుందుకున్న ఎన్నికల నామినేషన్లు

రెండు చోట్ల ఎన్నికలు వాయిదా...

పొదిలి, వేటపాలెం మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. పొదిలిలో ఎంపీటీసీ స్థానం బీసీ మహిళకు కేటాయించడం వల్ల, ఎంపీటీసీ స్థానాలేవీ బీసీ మహిళకు రిజర్వు కాకపోవడం వల్ల ఎన్నికల కమిషన్‌ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నిక వాయిదా వేశారు. వేటపాలం పంచాయితీ విలీనం అంశంపై కోర్టులో కేసు ఉన్నందున ఎంపీటీసీ ఎన్నికలు వాయిదాపడింది. ఇక్కడ జడ్పీ ఎన్నిక యథావిధిగా సాగుతుంది.

ఇవీ చదవండి...స్థానిక ఎన్నికల్లో తెదేపాతో కలిసి పోటీ:సీపీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.