ప్రకాశం జిల్లా అద్దంకి-నార్కెట్పల్లి రహదారి ప్రమాదాలకు నెలవుగా మారింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆ మార్గం ఇప్పుడు ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. వాహన చోదకులు మలుపులను తెలుసుకునే విధంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు అధికారులు ఏర్పాటు చేయటం లేదు. అద్దంకి పోలీసులు గతంలో రహదారిపై వాహనాల వేగం తగ్గించేందుకు వీలుగా... ఖాళీ డ్రమ్ములు, టైర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని ఆకతాయిలు రహదారి పక్కనే పడేశారు. మలుపుల వద్ద రహదారికి ఇరువైపులా చెట్లు ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: చరవాణి కోసం బస్సును వెంబడించి... అనంతలోకాలకు..!