ETV Bharat / state

New Districts: మంత్రి వెల్లంపల్లికి జిల్లాల పునర్విభజన సెగ.. కాన్వాయ్ అడ్డగింత

మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ.. ప్రకాశం జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ కాన్వాయ్​ను మార్కాపురం జిల్లా సాధన సమితి నేతలు అడ్డుకున్నారు. 18 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సహకరించాలని మంత్రికి వినతిపత్రం అందించారు.

మంత్రి వెల్లంపల్లికి జిల్లాల పునర్విభజన సెగ.. కాన్వాయ్ అడ్డగింత

author img

By

Published : Feb 26, 2022, 3:37 PM IST

మంత్రి వెల్లంపల్లికి జిల్లాల పునర్విభజన సెగ

దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు.. జిల్లాల పునర్విభజన సెగ తగిలింది. మార్కాపురం జిల్లా సాధన సమితి నేతలు వెల్లంపల్లి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డితో కలిసి వెళ్తున్న మంత్రి వాహన శ్రేణిని.. ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసులు వారిని పక్కకు లాగారు. దీక్షా శిబిరాన్ని గమనించి కారు ఆపిన మంత్రి వెల్లంపల్లి.. జిల్లా సాధన సమితి నేతలతో మాట్లాడారు. 18 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, మార్కాపురం జిల్లా ఏర్పాటుకు మీరైనా సహకరించాలని మంత్రికి వినతిపత్రం అందించారు.

స్థానిక ప్రజల మనోభావాల్ని గుర్తించి.. మార్కాపురం జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నేత గూడూరి ఏరిక్షన్‌ బాబు డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లాలో వైకాపా పార్టీకి పరాభావం తప్పదని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలో జరుగుతున్న రిలే దీక్షకు తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపారు. ఎప్పటినుంచో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షగా ఉన్న మార్కాపురం జిల్లాను ప్రభుత్వం ప్రకటించకపోవడం అన్యాయమన్నారు.

కొనసాగుతున్న ఆందోళన..
మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ..ప్రజలు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రీలే నిరాహార దీక్ష నేటితో 18వ రోజుకు చేరుకుంది. కనిగిరి పులి వెంకటరెడ్డి పార్కు వద్ద అఖిలపక్షాల ఆధ్వర్యం నిరహార దీక్షలు చేపట్టారు. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెంలను కలుపుకొని ఐదు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరగొచ్చు: సీపీఐ నేత నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.