ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కమీషనర్ నయీం అహ్మద్, తన ఇంట్లో పనిచేస్తున్న కార్మికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాండంటూ..రెండో రోజు విధులు బహిష్కరించారు పారిశుద్ద కార్మికులు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట సామూహిక ధర్నా చేపట్టిన పారిశుద్ద కార్మికులు బాధితురాలికి న్యాయం జరిగే వరకు విధుల్లో చేరేది లేదని ప్రకటించారు. కమీషనర్‌ను విధుల్లోనుండి తొలగించిన తరువాతే, తాము విధులకు హజరవుతామని వారు తెలిపారు.
ఇదీ చూడండి: కెమెరా కన్నుతో చూస్తే ప్రతి చిత్రమూ అద్భుతమే...