ప్రకాశం జిల్లా అద్దంకిలోని పంచాయతీ కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. తమను సచివాలయాలకు కేటాయించవద్దని, మున్సిపల్ కార్యాలయం వద్దే విధులు కొనసాగించాలని కోరారు. అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, గత వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. తమను సచివాలయాలకు కేటాయించడం తగదు అంటూ నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకులు సీహెచ్ గంగయ్య, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:వైభవంగా ముగిసిన కనకదుర్గమ్మ శాకంబరీ ఉత్సవాలు