ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడులో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితురాలిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీచదవండి.: ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం