Lack of Maintenance of Mopadu Reservoir: ప్రకాశం జిల్లాలో పామూరు మండలం మోపాడు రిజర్వాయర్ బ్రిటీష్ కాలంలో నిర్మించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని సుమారు 25వేల ఎకరాల ఆయకట్టుకు ఇది నీరందిస్తోంది. పామూరు మండలంలో పలు గ్రామాల తాగునీటి అవసరాలూ తీరుస్తోంది. ఇలాంటి జలాశయం.. నిర్వహణ తీసికట్టుగా మారింది. గట్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. తూములు, అలుగు నిర్వహణ పూర్తిగా విస్మరించారు. ప్రధాన తూము నుంచి.. నీరు వృథాగా పోతోంది. జలాశయంలో ఉన్న చేపలు పట్టుకోవడానికి అనువుగా నీటిని వృథాగా వదిలేస్తున్నారని.. రైతులు అంటున్నారు.
గత వర్షాకాలంలో జలాశయం కట్టల్లో లీకులు వచ్చి తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో తాత్కాలికంగా మట్టిపోసి వదిలేశారు. కనీసం జలాశయ నిర్వహణ చూసే అధికారులూ.. లేరని రైతులు తప్పుపడుతున్నారు. తూములు, కట్టల మరమ్మతులకు నాబార్డు నిధులు వచ్చినాఎక్కడా బాగుచేసిన ఆనవాళ్లు లేవని మండిపడుతున్నారు. జలాశయ నిర్వహణపై దృష్టిపెట్టకపోతే.. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నీరుగారిపోతుందని రైతులు విమర్శిస్తున్నారు.
" ఇంతకు ముందు చెరువు నిండిన తరువాత.. అందరూ .. సమావేశమై.. కమిటీ ద్వారా.. రైతులు ఎటువంటి పంటలు సాగు చేయాలని అనే నిర్ణయంతో నీళ్లను వదిలేవారు. కానీ ఇప్పుడు.. వ్యవస్థలన్నీ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన పంటను వాళ్లు సాగు చేస్తున్నారు. నీళ్లు అంతా వృథా అయిపోతున్నాయి. ఈ చెరువులో నీళ్లు ఉంటే.. రెండు మూడు మండలాలలో గ్రౌండ్ వాటర్ పుష్కలంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం రైతు కంటే చేపలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుంది.". - స్థానికుడు
"రెండు సంవత్సరాలుగా నీళ్లు ఉన్నాయి. కానీ వాటిని సక్రమంగా వాడటం లేదు. చేపల కోసం వాళ్లకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడే నీళ్లు వదిలేస్తున్నారు. నాబార్డ్ నిధులు వచ్చాయి.. కానీ ఇప్పటి వరకూ అస్సలు.. ఏం రిపేరు చేయలేదు". - స్థానికుడు
" గతంలో అధికారులంతా ఇక్కడే ఉండేవారు.. కానీ ప్రస్తుతం ఇక్కడ ఎవరూ ఉండటం లేదు. దీంతో ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు.. వాళ్లు నీళ్లను వదులుకుంటున్నారు". - స్థానికుడు
ఇవీ చదవండి: