గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా రెడ్ జోన్ గా ప్రకటించిన ఆనంద్ పేట, సంగడిగుంట ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెడ్ జోన్ పేరుతో కఠిన ఆంక్షలు విధించారని.. కనీసం మందులు కూడా అందుబాటులో లేవని, నిత్యావసర వస్తువులు కొన్ని ఇళ్లకు అందటంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ముస్తఫా... కొద్దిపాటి ఆంక్షలు తొలగించాలని అధికారులకు సూచించారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
ఇది చదవండి నరసరావుపేటలో ఆగని వైరస్ వ్యాప్తి.. వంద దాటిన కేసులు