ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తన జన్మదిన వేడుకలను స్థానికంగా నిర్వహించుకునేందుకు హెలికాప్టర్లో బెంగళూరు నుంచి దర్శికి చేరుకున్నారు. రేపు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నాయకులు సన్నాహాలు చేశారు.
స్థానికంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి బెంగళూరు వెళ్లేందుకు సమయం సరిపోనందున హెలికాఫ్టర్లో ప్రయాణించేందుకు సన్నాహాలు చేశారు. దీనిలో భాగంగా నేడు బెంగళూరు నుంచి దర్శికి హెలికాఫ్టర్లో వచ్చి స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరిగి రేపు హెలికాఫ్టర్లో బెంగళూరుకు చేరుకోనున్నారు. ఇప్పటి వరకు దర్శి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు ఎవరు ఇలాంటి సాహసం చేయలేదని స్థానిక ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి..