నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. ఇంకొల్లు మండలం పావులూరులో దెబ్బతిన్న మిరప పంటలను పరిశీలించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తుపాను ప్రభావంతో పంటలన్నీ పాడవుతున్నా అధికార పార్టీ నాయకులు స్పందించడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల వంక కన్నెత్తయినా చూడలేదన్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం అని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: