ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో కరోనా పరిస్థితులపై మంత్రులు, అధికారుల సమీక్ష - minister adimulapu suresh

ప్రకాశం జిల్లాలో కరోనా పరిస్థితులపై మంత్రులు, అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పినిపె విశ్వరూప్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పాల్గొన్నారు. జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు.. కొవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

ministers-officers-meeting-on-corona-cases-in-prakasam-district
ప్రకాశం జిల్లాలో కరోనా పరిస్థితులపై మంత్రులు, అధికారులు సమీక్ష
author img

By

Published : May 29, 2021, 6:36 AM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మంత్రి.. జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రోజువారీగా అధిక సంఖ్యలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించడంతో పాటు రికవరీ రేటు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నందున జిల్లాలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి బాధితులకు పౌష్టికాహారం అందిస్తున్నామని, వ్యాక్సినేషన్ విషయంలోనూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని మంత్రి అన్నారు.

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి...

జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు పాత్ర వహించాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ. శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. కొవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రావాలని కోరారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్..

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైన వైద్యులను, వాహనాలను సమకూర్చుకోవడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ స్వీయ నియంత్రణలో ఉండాలని కోరారు.

జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్...

రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ జిల్లాలో కొవిడ్ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఈ నెల రెండో వారంలో దాదాపు 23 శాతం ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 16 శాతానికి తగ్గిందన్నారు. 104 కాల్ సెంటర్​కు ఫోన్ చేసిన వారికి తక్షణమే సహాయం అందించేందుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు వెల్లడించారు.

ఇదీచదవండి.

బైక్ దొంగల ముఠాలు అరెస్టు... 36 ద్విచక్రవాహనాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.