ETV Bharat / state

'ప్రజాసమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దు'

ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించకుండా... దరఖాస్తులు వచ్చిన వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆయన అధికారులతో సమీక్షించారు.

మంత్రి ఆదిమూలపు సురేష్
author img

By

Published : Jul 28, 2019, 7:52 PM IST

మంత్రి ఆదిమూలపు సురేష్

ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆయన నివాసంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పరంగా రైతులు చాలా ఇబ్బందులకు గురౌతున్నారన్న మంత్రి... దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు.

దోర్నాల మండలంలో వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు పెద్ద సంఖ్యలో మంత్రిని కలిశారు. వెలుగొండ ప్రాజెక్టు కాలువ తెగి... కడపరాజుపల్లిలోకి భారీగా వర్షపు నీరు వచ్చి పంటలు మునిగి నష్టపోయామని గోడు వెళ్లబోసుకున్నారు. సుమారు రూ.36 లక్షల మేర నష్టం జరిగిందని అధికారులు మంత్రికి చెప్పగా... సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. తక్షణమే కాలువ మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి...

గుర్రంపై సవారీ.. చదువు చెప్పేందుకేనోయీ!

Intro:Ap_cdp_48_28_BJP lo_cherika_Av_Ap10043
k.veerachari, 9948047582
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భాజపా ఎదుగుతోందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. కడప జిల్లా రాజంపేట పట్టణానికి చెందిన పలువురు యువకులు ఆదివారం భాజపాలో చేరగా వారికి కండువాలు వేసి ఇ పార్టీలోకి ఆహ్వానించారు. తొలుత పార్టీ నాయకులు యువకులు ర్యాలీగా ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం అతిథి గృహం ఆవరణంలో పార్టీలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా నేతృత్వంలో పని చేయడానికి ఎంతోమంది యువకులు ఉత్సాహం చూపుతున్నారని, సభ్యత్వ నమోదుకు ఉరకలు వేస్తున్నారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని సూచించారు. భారతదేశ ఆత్మగౌరవాన్ని సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.

Body:రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా

Conclusion:బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.