ETV Bharat / state

'పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు' - మంత్రి బాలినేని న్యూస్

పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో... వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత తెదేపా పాలనలో పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఆ పార్టీ కార్యకర్తలకు తప్ప వేరొకరి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. వచ్చే జనవరి 9న అర్హులైన ప్రతి ఒక్కరికీ అమ్మఒడి కింద రూ.15 వేలు అందిస్తామన్నారు.

'పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు'
'పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు'
author img

By

Published : Dec 5, 2019, 10:29 PM IST

మంత్రి బాలినేని ప్రకాశం పర్యటన

ప్రకాశం జిల్లా మక్కెనవారిపాలెంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఆ పార్టీ వారికే ఇచ్చారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పార్టీలకు అతీతంగా ఇచ్చారని గుర్తుచేశారు. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చే బాధ్యత వాలంటీర్లపై ఉందని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలాలు, పింఛన్లు అందించాలని సూచించారు.

ప్రతీ పేదవాడికి ఇల్లు...
ముఖ్యమంత్రి జగన్... రాష్ట్రంలో గుడిసె లేకుండా చేసే ప్రయత్నం చేపట్టారని, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. నవరత్నాల్లో భాగంగానే జనవరి 9న అర్హులందరికీ అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సంతమాగులూరు మండలంలోని అన్ని గ్రామాల్లో వైకాపా జెండా ఎగురవేసే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

ఇదీ చదవండి :

'రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగితే నిరూపించండి'

Intro:ap_ong_61_05_mantri_balinani_toor_avb_ap10067

Contrebhuter : nataraja
Center : addanki
-----------------------------------
రాష్ట్ర విద్యుత్ , అటవీ ,పర్యావరణ
మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి మక్కెనవారిపాలెం లో సచివాలయ
భవన శంకుస్థాపన కార్యక్రమంలొ పాల్గొన్నారు.
అద్దంకి నియోజవర్గ్ ఇన్ఛార్జ్
శ్రీ బాచిన కృష్ణ చైతన్య ,మాజి ఎమ్మెల్యె గరటయ్య హజరయ్యారు. గ్రామస్తులు,పార్టికార్యకర్తలు అధిక సంక్యలొ పాల్గొన్నారు.అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్లు ఇళ్ల స్థలాలు పార్టీకి సంబంధించిన వారికే ఇవ్వటం జరిగిందన్నారు.
ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెన్షన్లు ఇళ్ల స్థలాలు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగిందని అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అర్హులందరికీ రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.వాటి పూర్తి బాధ్యత వాలంటరీ లే అర్హులకు గుర్తించి పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలాలు పెన్షన్లు అందే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గుడిసె అనేది లేకుండా చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేపట్టారని కనుక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి విధంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
నవరత్నాల్లో భాగంగానే జనవరి 9వ తేదీ అర్హులందరికీ అమ్మ ఒడి 15 వేల రూపాయలు ప్రతి తల్లి ఎకౌంట్లో వేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
జనవరి లో రాబోతున్న పంచాయతీ ఎన్నికల్లో సంతమాగులూరు మండలం లో అన్ని గ్రామాల్లో వైఎస్ఆర్సిపి జెండా ఎగురవేసే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.