ETV Bharat / state

'ఒంగోలు అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం' - Minister Balineni srinivasreddy news

ఒంగోలు నగర పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. నగర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Minister Balineni
ఒంగోలులో పలు అభివృద్ధి పనులకు మంత్రి బాలినేని శ్రీకారం
author img

By

Published : Feb 8, 2021, 9:32 PM IST

ఒంగోలు నగర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు నగర పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన సోమవారం శ్రీకారం చుట్టారు. పులివెంకటరెడ్డి కాలనీ నుంచి కొప్పోలు వరకు కోటీ 90 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎఫ్.సి.ఐ. రోడ్డులో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు.

రిమ్స్ ఆస్పత్రి వెలుపల కోటీ లక్షల రూపాయల వ్యయమైన డ్రైనేజీ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 15వ ఆర్థిక సంఘం నిధులు 10 కోట్ల రూపాయలతో ఒంగోలు నగరంలో అవసరమైన చోట్ల డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. రహదారుల నిర్మాణానికి కూడా త్వరలో నిధులు మంజూరు చేయించి పనులు చేపడతామన్నారు. పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని... 90 కోట్ల రూపాయల వ్యయంతో త్వరలో నల్ల కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.

కొవిడ్ నేపథ్యంలో రిమ్స్​లో గత ఆరు నెలలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్​లుగా పనిచేస్తున్న సిబ్బంది ఈ సందర్భంగా మంత్రిని కలిశారు. రిమ్స్​లో ప్రస్తుతం "ఈ- హాస్పిటల్" విధానం అమలవుతున్నందున తమను కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కలెక్టర్​తో మాట్లాడతానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

ప్రచారంలో వాలంటీర్లు.. ఓటర్ల స్లిప్పులపై ప్రభుత్వ పథకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.