ETV Bharat / state

సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరవాలనుకుంటున్నాం: మంత్రి సురేశ్

ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో 4 కోట్ల మందికి 43 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా అందించామని విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

minister adimulapu suresh started jagananna pachha thoranam at prakasham district

author img

By

Published : Jul 22, 2020, 6:32 PM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మిల్లంపల్లి టోల్ ప్లాజా దగ్గర పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలో పచ్చతోరణం కింద అంతర్గత రహదారుల వెంబడి జిల్లా కలెక్టర్ పోల భాస్కర్​తో కలిసి మంత్రి సురేశ్ మొక్కలు నాటారు. పరిపాలనలో నూతన సంస్కరణలో భాగంగా గ్రామ సచివాలయాలు తీసుకువచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా పట్టాలను పంచడానికి సిద్ధం చేశామన్నారు. కరోనా వైరస్ తగ్గే వరకూ ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించాలని.. ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. ఇప్పుడు పాఠశాలలు తెరిచే పరిస్థితి లేదని.. సెప్టెంబర్ 5న జూన్ పాఠశాలలు తెరవాలనుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండి: వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.