ETV Bharat / state

వైసీపీకి వర్తించని జీవో నెం.1.. ప్రకాశం జిల్లాలో మంత్రి సురేష్​ ర్యాలీ - Andhra Pradesh Main News

Minister Adimulapu Suresh rally: ప్రతిపక్ష పార్టీలు ఏ సభలు పెట్టినా అడ్డుకునే పోలీసులు.. అధికార పార్టీకి మాత్రం కొమ్ము కాస్తున్నారు. ప్రతిపక్షానికి వర్తించే జీవో నెంబర్‌-1 అధికార పార్టీకి వర్తించదు అనే రీతిలో వైసీపీ నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలో మంత్రి ఆదిమూలపు సురేష్.. కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

Minister Adimulapu Suresh rally
ప్రకాశం జిల్లాలో మంత్రి సురేశ్‌ ర్యాలీ
author img

By

Published : Jan 6, 2023, 8:01 PM IST

Updated : Jan 6, 2023, 8:34 PM IST

Minister Adimulapu Suresh Rally: రోడ్డుషోలు, ర్యాలీలకు అనుమతి లేదంటూ జీవో నెంబర్‌-1 జారీ చేసిన ప్రభుత్వం.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా ఇతరుల కార్యక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. ఇప్పటికే కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు పర్యటనకు పూర్తిస్థాయిలో ఆటంకాలు సృష్టించింది. కానీ అధికార వైసీపీ నాయకులు మాత్రం భారీగా కార్యకర్తలను వెంటేసుకుని ర్యాలీలు చేస్తుంటే నిలువరించడం సంగతి అటుంచి, దగ్గరుండి మరీ భద్రత కల్పిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏ సభలు పెట్టినా అడ్డుకునే పోలీసులు అధికార పార్టీకి మాత్రం కొమ్ముకాస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలో మంత్రి ఆదిమూలపు సురేష్.. కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

వైసీపీకి వర్తించని జీవో నెం.1.. ప్రకాశం జిల్లాలో మంత్రి సురేష్​ ర్యాలీ

ఇవీ చదవండి:

Last Updated : Jan 6, 2023, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.