ETV Bharat / state

పిల్లలను జాగ్రత్తగా బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదే: మంత్రి సురేశ్ - పాఠశాలలు పునఃప్రారంభంపై మంత్రి సురేశ్ వ్యాఖ్యలు

పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా బడికి పంపే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని ఆలయాలను దర్శించుకున్నారు.

adimulapu suresh
ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖ మంత్రి
author img

By

Published : Oct 24, 2020, 12:40 PM IST

నవంబర్ 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించనున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. నాడు-నేడు కింద పాఠశాలలన్నింటిని అభివృద్ధి చేశామని తెలిపారు. విద్యార్థులు చాలాకాలం ఇంటిపట్టునే ఉన్నారని.. వారు, తల్లిదండ్రులూ పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నారన్నారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా స్కూళ్లకు పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి, బాలత్రిపుర సుందరీదేవి ఆలయాలను మంత్రి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో జరుగుతున్న నవరాత్రుల పూజలో పాల్గొన్నారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి.. తీర్ధప్రసాదాలు స్వీకరించారు. దాతల సహాయంతో, దేవదాయశాఖ ఆధ్వర్యంలో త్రిపురాంతకంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఇవీ చదవండి..

సరిహద్దుల వరకు రండి.. అక్కడ బస్సులుంటాయి: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.