ప్రకాశం జిల్లా కురిచేడు సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద 27 మంది వలస కూలీలను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పనుల కోసం గుంటూరు జిల్లా పత్తిపాడుకు వెళ్లినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక తిరిగి సొంతూరైన కర్నూలు జిల్లా ఆదోనికి నడుచుకుంటూ బయలుదేరినట్లు వివరించారు. గత మూడు రోజుల నుంచి నడుస్తూనే ఉన్నామని చెప్పారు. వీరిని ఎస్సై రామిరెడ్డి కురిచేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వీరిని క్వారంటైన్‌ను కానీ రిలీఫ్ సెంటర్‌కు తరలిస్తామని ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి..