ETV Bharat / state

వైరస్​ నివారణకు మాస్క్ ధరించడం ఒక్కటే మార్గం: మంత్రి సురేశ్​

కొవిడ్-19 నివారణకు మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేశ్​ అన్నారు. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంగోలులో 'కరోనా వైరస్​కు మాస్క్ కవచం.. స్వీయ నియంత్రణే రక్షణ' అనే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.

mask rally at ongole prakasam district
వైరస్​ నివారణకు మాస్క్ ధరించడం ఒక్కటే మార్గం: మంత్రి సురేశ్​
author img

By

Published : Oct 21, 2020, 3:38 PM IST

కరోనా వైరస్​ నివారణకు మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేశ్​ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 'కరోనా వైరస్​కు మాస్క్ కవచం.. స్వీయ నియంత్రణే రక్షణ' అనే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.

కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని.. ఆ శ్రమను ప్రజలు గుర్తించి బాధ్యతగా మెలగాలని కోరారు. వైరస్​పై అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ర్యాలీలో కలెక్టర్ పోల భాస్కర్, ఎంపీ శ్రీనివాసులురెడ్డి, డీఎంహెచ్​ఓ రత్నవేణి, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

పోలీసు‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.