ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం గ్రీన్ జోన్ గా మారింది. ఈ వివరాలను ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, ఆర్డీఓ శేషిరెడ్డి, డీఎస్పీ నాగేశ్వరరెడ్డి వెల్లడించారు. నిన్నటి వరకు కంటైన్మెంట్ జోన్‌గా ఉన్న మార్కాపురం నేటి నుంచి గ్రీన్‌జోన్ పరిధిలోకి వెళ్లింది. పట్టణంలో ఉన్న ఒక పాజిటివ్ కేసు కోలుకుని వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను నేటి నుంచి సడలించారు. అదే విధంగా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ తప్పని సరిగా ధరించాలన్నారు. మాస్క్ లేకుండా మార్కాపురంలో తిరిగితే వంద రూపాయలు జరిమానా విధించనున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. అలాగే దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకుంటే దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శుభకార్యాలు చేసుకునే వారు భౌతిక దూరం పాటిస్తూ 20 మంది మించకుండా ఉండాలన్నారు.
ఇవీ చదవండి...హైదరాబాద్ నుంచి ఒడిశాకు సైకిల్‌పై ప్రయాణం