ETV Bharat / state

PROTEST : వారానికి రెండు ట్యాంకర్లు ఎలా సరిపోతాయి.. ఎమ్మెల్యే నిలదీత! - MLA kunduru nagarjunareddy

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని మార్కాపురం మండల కేంద్రం వాసులు అడ్డుకున్నారు. తాగునీరు లేక ఎన్నో నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు
ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు
author img

By

Published : Dec 29, 2021, 3:21 PM IST

ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండల కేంద్రం వాసులు.. ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని అడ్డుకున్నారు. మార్కాపురంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించి, తిరిగి వెళుతున్న సమయంలో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఎన్నో నెలలుగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

కూలీ పనులు చేసుకునే తాము.. తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. తమ ఊరికి వారానికి రెండు ట్యాంకర్లు ఎలా సరిపోతాయని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. స్పందించిన ఎ‌మ్మెల్యే సంబంధిత అధికారులను పిలిపించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

ఇదీచదవండి :

PENSIONS HIKE: సామాజిక పింఛన్లు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.