ప్రకాశం జిల్లా జిల్లా ఇంకోల్లు మండలం భీమవరంలో ఏడు లక్షలను చోరీ చేసిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలో పాటబండ్ల వెంక్రటావ్ ఇంట్లో గత నెల 31వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బీరువాలో ఉన్న 7లక్ష 38 వేల రూపాయల నగదును దొంగలించారు. బాధితుడు ఇంకోల్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టారు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవరైన దార హారిష్ (28)ను అదుపులోకి తీసుకోని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు .అతని వద్ద నుంచి 7 లక్షల రూపాయల నగదును రికవరీ చేశారు. మిగతా డబ్బుతో.. జల్సా చేశాడని చీరాల డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. చోరీ కేసును త్వరగా ఛేదించిన సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఎస్సై చెంచుప్రసాద్ , సిబ్బందికి డీఎస్పీ రివార్డులు అందజేశారు.
ఇదీ చూడండి. విద్యార్థినులకు అందని ఆహారం.. పిల్లలను తీసుకెళ్లిన తల్లిదండ్రులు