ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబీకులకు సంబంధించి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడం, వాటిని ఇతరులకు పంపుతున్నారనే ఆరోపణపై ప్రకాశం జిల్లాకు చెందిన సాయి కిరణ్ అనే యువకుడిని గుంటూరు లోని సీఐడీ ప్రాంతీయ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో సాయి కిరణ్ ను ఉదయం నుంచి సాయంత్రం దాకా వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ఎందుకు అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు? వీటి వెనుక ఎవరిదైనా ప్రోత్సాహముందా అనే కోణంలో సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
సీఎం కుమార్తెకు సంబంధించి అభ్యంతరకర పోస్టింగులు పెట్టారనేే అభియోగంపై ఇప్పటికే తెనాలికి చెందిన బొలినేని జయశ్రీ అనే మహిళను పోలీసులు సీఐడీ అధికారులు అరెస్టు చేయగా.. బెయిల్ పై ఆమె విడుదలయ్యారు. ఇదే కేసులో ఒంగోలు మండలం దాసరాజుపల్లికి చెందిన 31 ఏళ్ల సాయికిరణ్ ను విచారణకు పిలిపించారు. తాను వ్యక్తిగతంగానే పోస్టులు పెట్టానే తప్ప తనను ఎవరూ ప్రోత్సహించలేదని సాయికిరణ్ సీఐడీ విచారణలో వివరించినట్లు తెలిసింది. సొంత పూచీకత్తుపై సాయంత్రం 5 గంటలకు సాయికిరణ్ ను విడుదల చేశారు.
ఇదీ చదవండి:
Chandrababu: 'భారీగా అప్పులతో.. అవినీతి, దుబారా చేస్తున్నారు'