అదనపు కట్నం కోసం భార్యను దారుణంగా హతమార్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా లక్కవరానికి చెందిన భాస్కర్‌కు, పద్మావతి అనే మహిళతో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని ఆమెను వేధించేవాడు. ఇటీవల సమీపంలోని పూనూరు గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి దంపతులిద్దరూ వెళ్లారు. తిరిగి ఇంటికి చేరేక్రమంలో మార్టూరు మండలం కోనంకీ వద్ద ఉన్న కాలవలో ముంచి భార్యను హత్య చేశాడు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అదనపు కట్నం తీసుకురాలేదనే కోపంతోనే భార్యను హత్యచేసినట్లు చీరాల డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.
ఇదీ చదవండి: