ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ కారణంగా.. ప్రధాన పట్టణాల్లో లాక్‌డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఒంగోలు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. అయినా కొంతమంది పనుల కోసమంటూ రహదారులపై తిరగుతున్నారు. లాక్‌డౌన్ సమయాన ఇంట్లో ఉండకుండా ద్విచక్రవాహనాలు, కార్లమీద చక్కర్లు కొట్టే పౌరులను అడ్డుకొని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
మాస్క్ లు లేకపోయినా వంద రూపాయల చొప్పున పెనాల్టీ వేస్తున్నారు. వ్యాపార సంస్థలన్నీ మూసివేసినా ఇంకా బయట తిరగడమేమిటని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వైద్య పరమైన అవసరాలు ఉంటే తప్ప... ప్రధాన రహదారుల్లో ప్రజలు సంచరించకుండా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: