పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలని ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్తు బిల్లు చట్ట సవరణలను విరమించుకోవాలంటూ ధర్నా నిర్వహించారు. సుందరయ్య భవన్ ఆవరణలో వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
లాక్ డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో నిరసన కారులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఆర్థికంగా చితికిపోయిన సామాన్యులకు ఇలా విద్యుత్తు చార్జీలు పెంచడం అన్యాయమన్నారు.
ఇదీ చదవండి: