విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయానికి చెందిన ఎగువ కాలువకు స్వల్పంగా గండి పడింది. జలాశయం నుంచి ఆదివారం పొలాలకు సాగునీటిని విడుదల చేశారు. కాలువ నిర్వహణ అధికారులు ముందుగా పరిశీలించకపోవడంతో మంచాల గ్రామ సమీపంలోని కశిరెడ్డి వారి కళ్లాల వద్ద కాలువకు స్వల్పంగా గండి పడింది. నీరంతా సమీప పొలాల్లోకి వృథాగా పోతుంది. స్థానిక రైతులు అదుపు చేయడానికి ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి