ప్రకాశం జిల్లా: కంభం మండలంలోని స్థానిక రైతు భరోసా కేంద్రంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోషకాహార వస్తువులను పంపిణీ చేశారు.
శ్రీకాకుళంలో..
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని డీసీఎంఎస్ చైర్మన్ ప్రియా సాయిరాజ్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి, లొద్దపుట్టి రైతు భరోసా కేంద్రాలలో వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మాతృ, శిశు మరణాలు తగ్గించేందుకు సీఎం జగన్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు.
విశాఖలో..
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పేదలకు పోషకాహారం అందించే విధంగా సీఎం జగన్ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించారని మంత్రి వివరించారు.
విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలకు పోషక ఆహారాన్ని అందజేశారు.
చిత్తూరులో..
రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి ఇవాళ ప్రారంభించిన వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం సందర్భంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో సీడీపీఓ నాగవేణి సంపూర్ణ పోషణ కార్యక్రమంపై సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలతో సమీక్షించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలలో రక్తహీనత, పిల్లల్లో పోషణ లోప సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.
ఇదీ చదవండి: